NOTE:
Hello Viewers, your Website Beyond Filmy Adda is going to restart all its activities
FROM THIS OCTOBER, 2019

Due to some issue, the site isn't loading correctly, so please click the below celebrating 200 likes poster to load the website correctly. We are working on it and will be resolved soon !

200 Likes

Review

Slider

Latest Videos

Tollywood

Film News

Latest Stills

Movie Reviews

Mobile World

First Look

» » » » » » » సమీక్ష : తుఫాన్ – చూడదగిన పోలీస్ డ్రామా..

 

విడుదల తేదీ : 06 సెప్టెంబర్ 2013

రేటింగ్ : 3.25/5

దర్శకుడు : అపూర్వ లఖియా

నిర్మాత : రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం చిరంతన్ భట్ – ఆనంద్ రాజ్

ఆనంద్ – మీట్ బ్రోస్ అంజన్

నటీనటులు : రామ్ చరణ్, ప్రియాంక చోప్రా,

శ్రీహరి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తూ చేసిన సినిమా ‘జంజీర్’. ఈ సినిమాని తెలుగులో ‘తుఫాన్’గా తెరకెక్కించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అపూర్వ లఖియా డైరెక్టర్. తెలుగు వారి కోసం కథలో కొన్ని మార్పులు చేసారు. ఆ మార్పులను అలాగే తెలుగులో షూట్ చేసిన సన్నివేశాలకు డైరెక్టర్ యోగి దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. ‘తుఫాన్’సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేము ఈ సినిమాని ఈ రోజే ప్రత్యేకంగా వీక్షించడం వల్ల ఈ సినిమా రివ్యూని మీకు అందిస్తున్నాం. టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా తన మార్క్ వేసుకున్నాడో? లేదో? ముంబై కె హీరో అనిపించుకున్నాడో? లేదో? ఇప్పుడు చూద్దాం..
కథ :
ఎసిపి విజయ్ ఖన్నా ధైర్య సాహసాలు మరియు నిజాయితీ కలిగిన యంగ్ పోలీస్ ఆఫీసర్. విజయ్ ఎంతో నిజాయితీ ముక్కుసూటిగా పోయే స్వభావం వల్ల ఒక్క చోట కూడా ఎక్కువ రోజులు పనిచేయకుండా ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. కానీ అతను తన స్వభావాన్ని ఏ మాత్రం మార్చుకోడు. హైదరాబాద్ లో అధికారంలో ఉన్న పార్టీ నేతలతో ఘర్షణ జరగడం వల్ల అతన్ని ముంబైకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ముంబైలో ఒక డిప్యూటీ కలెక్టర్ ని ఎంతో దారుణంగా హత్య చేసిన కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని విజయ్ కి అప్పగిస్తారు. ఆ తర్వాత దాని వెనుక ఒక పవర్ఫుల్ ఆయిల్ మాఫియా క్రైమ్ జరుగుతోందని తెలుసుకుంటాడు. ఆ విషయంలో ఎన్నారై మాయ (ప్రియాంక చోప్రా) ఒక్కటే ఆ నేరాన్ని నిరూపించడానికి ఉన్న ఏకైక సాక్షి, దాంతో విజయ్ తన సాయం అడుగుతాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో విజయ్ కి ఆ మొత్తం ఆపరేషన్ వెనక ఉన్నది రుద్ర ప్రతాప్ తేజ(ప్రకాష్ రాజ్) అని తెలుస్తుంది.
విజయ్ కేసును పరిష్కరిస్తూ చివరికి చేరుకునే దశలో ఉండగా రుద్ర ప్రతాప్ తన డబ్బు మరియు పలుకుబడి ఉపయోగించి విజయ్ ని సస్పెండ్ చెయ్యాలని ప్రయత్నిస్తాడు. దాంతో విజయ్ ఎంతో ఆవేశంతో రుద్ర ప్రతాప్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత రివెంజ్ డ్రామా ఎలా సాగింది? విజయ్ షేర్ ఖాన్(శ్రీ హరి) మరియు నిజాయితీ గల క్రైమ్ రిపోర్టర్ జయ్ దేవ్(తనికెళ్ళ భరణి) సాయంతో రుద్ర ప్రతాప్ ని ఎలా అంతమొందించాడు? అనేది మీరు వెండి తెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మరోసారి రామ్ చరణ్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. పోలీస్ గా చరణ్ లుక్ బాగుంది, అలాగే ఎసిపి విజయ్ ఖన్నా పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఈ సినిమా రామ్ చరణ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఓ మంచి సినిమా సినిమా ఇది. ప్రియాంక చోప్రా బాగుంది. అలాగే ‘ముంబై కె హీరో’, ‘పింకీ’ పాటల్లో ప్రియాంక చాలా హాట్ గా కనిపించింది. శ్రీ హరి షేర్ ఖాన్ పాత్రలో చాలా బాగా సరిపోయాడు. ధైర్య సాహసాలు కలిగిన క్రైమ్ రిపోర్టర్ పాత్రలో తనికెళ్ళ భరణి పెర్ఫార్మన్స్ డీసెంట్ గా ఉంది.
మాఫియా డాన్ రుద్ర ప్రతాప్ తేజ పాత్రలో ప్రకాష్ రాజ్ నటన చాలా కూల్ అండ్ క్లాస్ గా ఉంది. మోన పాత్రలో మహీ గిల్ ప్రకాష్ రాజ్ కి మంచి సపోర్ట్ ఇచ్చింది. వారిద్దరి మధ్యా వచ్చే సీన్స్ లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అవి బి, సి సెంటర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. సినిమా చాలా వేగంగా జరుగుతుంది. అలాగే సినిమా నిడివి చాలా తక్కువ కావడం సినిమాకి ప్లస్ అయ్యింది. జేమ్స్ బాండ్ సినిమాల స్టైల్లో షూట్ చేసిన సినిమా టైటిల్స్ సాంగ్ లో మహి గిల్ తన అందాలతో బాగా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాని ఒరిజినల్ ‘జంజీర్’ తో పోల్చుకుంటే ఆ సినిమా కథ, స్క్రీన్ ప్లే కంటే కాస్త తక్కువగా అనిపిస్తుంది. ఈ సినిమా ప్లాట్ మనం ఊహించే విధంగా ఉంది. చరణ్ – ప్రియాంక చోప్రా మధ్య తీసిన రొమాంటిక్ ట్రాక్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని బాగా తీయాల్సింది. దీని ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్ – ప్రన్ మధ్య బంధాన్ని చాలా బాగా చూపించారు. దాన్ని ఆ రేంజ్ లో ఈ రీమేక్ జంజీర్ లో చూపించలేకపోయారు. చరణ్ – శ్రీ హరి రిలేషన్ లో ఎక్కడో ఎమోషన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది.
సినిమాలో పాటలు వచ్చే సందర్భాలు అస్సలు సూట్ అవ్వలేదు. ముఖ్యంగా ‘ముంబై కె హీరో సాంగ్’ అస్సలు సెట్ అవ్వలేదు. ఇది తెలుగు సినిమా కాదు మరియు చరణ్ అభిమానులు కోరుకునే మాస్ మసాల ఎంటర్టైన్మెంట్ ఇందులో మిస్ అయ్యింది. అలాగే కామెడీ కూడా చాలా తక్కువగా ఉంది.
సాంకేతిక విభాగం :
గురురాజ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఎక్కడో ఒకటి రెండు సీన్స్ లో తప్పితే మిగతా సన్నివేశాల్లో రీ రికార్డింగ్ జస్ట్ యావరేజ్ గా ఉంది. ఈ మూవీకి మరింత టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. తెలుగు డైలాగ్స్ కూడా జస్ట్ ఓకే. అపూర్వ లఖియా సినిమా మొత్తం చాలా వేగంగా ముందుకు సాగేలా తీసే విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ సినిమాలో కాస్త కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. ఈ సినిమాతో అపూర్వ డైరెక్టర్ గా పాస్ మార్కులు తెచ్చుకున్నాడు.
తీర్పు :
ఈ సినిమాని ఒరిజినల్ క్లాసిక్ మూవీ అయిన అమితాబ్ జంజీర్ తో పోల్చుకోవద్దు. ఈ రెండూ విభిన్న తరహా సినిమాలు. చరణ్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు మరియు సినిమాలో కొన్ని పవర్ఫుల్ సీన్స్ ఉన్నాయి. అలాగే సినిమా నిడివి తక్కువగా ఉండటం సినిమాకి హెల్ప్ అయ్యింది. ఇంకాస్త బెటర్ స్క్రిప్ట్ మరియు హై ఎంటర్టైన్మెంట్ ఉండుంటే ఈ సినిమాకి ఇంకా బాగా హెల్ప్ అయ్యింది. అయినప్పటికీ సినిమా ఓవరాల్ గా చూడదగిన డీసెంట్ పోలీస్ డ్రామా..
రేటింగ్ : 3.25/5

«
Next
Newer Post
»
Previous
Older Post

No comments:

Leave a Reply